Thursday, March 28, 2024
- Advertisement -

బూమరాంగ్ అయిన రాహుల్ రామకృష్ణ ట్వీట్

- Advertisement -

ఒక్కోసారి చేసే కామెడీ.. సీరియస్‌ అవుతూ ఉంటుంది. మనం అనుకున్నది ఒకటైతే.. ఫలితం మరోలా ఉంటుంది. నటుడు రాహుల్ రామకృష్ణకు ఇదే అనుభవం ఎదురైంది. 2022. ఇదే నా చివరిది. ఇకపై సినిమాలు చేయనంటూ ఆయన చేసిన ట్వీట్ పెను దుమారమే రేపింది. సోషల్ మీడియాలోనే కాదు.. చిత్ర పరిశ్రమలోనూ హాట్ టాపిక్ అయింది. రాహుల్ సీరియస్ గానే ఈ వ్యాఖ్యలు చేశాడా ? అన్న చర్చ జరిగింది.

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యంగ్ క్రేజీ కమెడియన్స్‌లో రాహుల్ ఒకరు. మంచి కామెడీ టైమింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. అర్జున్‌రెడ్డి విజయం తర్వాత వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ ఆయన కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ ఆయన ఓ రోల్‌ పోషించాడు. చిన్న సినిమాల నుంచి మొదలై ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ కమెడీయన్ ఉన్నట్టుండి ఎందుకిలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారో..అని అందరూ చర్చించుకున్నారు.

ఇక మరికొందరు మాత్రం ఇది ఏదో మూవీలోని డైలాగో అయి ఉంటుందని భావించారు. తాజాగా దీనిపై రామకృష్ణ స్పందించాడు. జోక్‌ చేశానంతే. భారీ రెమ్యునరేషన్‌, విలాసవంతమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలు వస్తుంటే ఎందుకు కాలదన్నుకుంటాను. నేను రిటైర్మెంట్‌ ప్రకటించానని నా స్నేహితులు ఫోన్‌ చేసి మరీ చెప్పటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అని రాహుల్‌ రామకృష్ణ ట్వీట్‌ చేశారు. అయితే, ఆయన ట్వీట్‌పై నెటిజన్ల మండిపడుతున్నారు. ‘అసలా ట్వీట్‌ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు జోక్‌ అని ఎందుకు అనాలి’, ‘కామెడీ సినిమాల్లో చెయ్‌ అన్నా. ట్విటర్‌లో కాదు’ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/eyrahul/status/1489947310260101124

అలియా మ‌న‌సులో ఉన్న ఆ హీరో ఎవ‌రు ?

భారీ ధ‌ర ప‌లికిన రాధేశ్యామ్ డిజిట‌ల్ శాటిలైట్ హ‌క్కులు

మాఫియా క్వీన్ గా బాలీవుడ్ చిన్న‌ది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -