మొదటి ఇంటిని అమ్మేసిన బిగ్‌ బీ.. ధర తెలిస్తే షాకే

- Advertisement -

బాలీవుడ్ బిగ్ బీ ఏం చేసినా బిగ్‌ న్యూసే. ఖరీదైన, విలాసవంతమైన బంగ్లాల కారణంగా కూడా వార్తల్లో నిలుస్తుంటారు. దేశంలోనే రిచ్చెస్ట్ సెలబ్రిటీల్లో ఒకరైన బిగ్‌ బీకి ఒక్క ముంబైలోనే ఐదారు బంగ్లాలు ఉన్నాయి. జనక్, జల్సా, ప్రతీక్ష, వత్స, అమ్మ అని వాటికి పేర్లు కూడా పెట్టుకున్నారు. గతేడాది అంధేరిలో సుమారు రూ.31 కోట్లు విలువచేసే మరో డూప్లెక్స్‌ ఫ్లాట్‌ని కూడా కొనుగోలు చేశారు.

అయితే తన మొదటి సొంత ఇంటిని అమ్మేసి ఇప్పుడు అమితాబ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సౌత్‌ ఢిల్లీలో గల ఆ బంగ్లాకు సోపాన్ అని పేరు. అమితాబ్ బచ్చన్ తల్లి తేజి బచ్చన్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. ఆ బంగ్లా రెండు అంతస్తులుగా 418 స్వ్కేర్ ఫీట్లు ఉంటుంది. అందులో అమితాబ్‌ తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ నివసించారు. అమితాబ్‌ నటుడిగా మారకముందు.. ముంబైకి వచ్చేవరకు కూడా ఢిల్లీలోని ఆ ఇంట్లోనే ఉండేవారు.

అయితే ఇప్పుడు ఆ ఇంటిని బిగ్‌బీ అమ్మేశారు. ఆ ఇల్లు ఏకంగా 23 కోట్ల ధర పలికింది. అది కూడా 1980కి ముందే కట్టి కూలిపోయే దశలో ఉన్న పాత బంగ్లాకి అంత ధర రావడం విశేషమనే చెప్పాలి. కొన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఎవరూ ఉండట్లేదు. దీంతో అమితాబ్ అమ్మకానికి పెట్టగా నెజన్ గ్రూప్ సంస్థల సీఈవో అవనీ బదేర్ కొనుకున్నారు. బచ్చన్‌ కుటుంబానికి దశాబ్దాలుగా పరిచయం ఉన్న వ్యక్తి అవని బదేర్. ఆ ఇంటికి దగ్గర్లోనే ఆయన నివాసం కూడా ఉంది.

ఆ ఒక్క సినిమాతో మారిపోయిన త‌ల‌రాత‌

మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా కంగ‌న

మాస్టర్ హీరోయిన్‌ పంట పండింది

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -