Saturday, April 20, 2024
- Advertisement -

వ్యాక్సిన్ అంటే తెలుసా.. మంత్రి కేటీఆర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -

గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీపై ప్రతిపక్షాలు మాటల యుద్దానికి దిగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ల అంశంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీజేపీ మహిళా నేత విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ విషయంలో మంత్రి కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాములమ్మ మంత్రిని టార్గెట్ చేశారు. అసలు కేటీఆర్ కు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? అని విజయశాంతి ప్రశ్నించారు.

వ్యాక్సిన్ అనేది గంటలలోనో… రోజులలోనో… ఉత్పత్తి అయి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదని… అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రోత్సాహంతో మన శాస్త్రజ్ఞులు అతి తక్కువ సమయంలోనే టీకాలు అభివృద్ధి చేశారు. తద్వారా భారత్ పాటవం మరోసారి ప్రపంచానికి వెల్లడైంది. ఓవైపు ఇంత జరిగితే… ఇంకా కేంద్రానికి ప్లాన్ లేదు, విజన్ లేదు అంటూ మాట్లాడుతున్న కేటీఆర్ గారికే సరైన విజ్ఞత లేదని అర్థమవుతోంది.

భారత్ లో జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. జనవరి 16 నుంచి మొదలు ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా టీకా డోసుల (వ్యాక్సినేషన్) పూర్తి చేశాం. ఇది అమెరికా కంటే ఎక్కువ. ఈ లెక్కలు తెలుసా కేటీఆర్ గారూ? అంటూ చురకలు అంటించారు. కేసీఆర్ కుటుంబం జీవితమే కమీషన్ల బాపతు అని ఫైర్ అయ్యారు. కరోనా విషయంలో టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని అన్నారు.

టీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతో ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల దోపిడీ దందా కొనసాగింది. నిర్వహణలో విఫలం కావడతో పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ వృథా అయింది. మొత్తమ్మీద కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. కేటీఆర్ వ్యాక్సినేషన్ పై కేంద్రం మీద నిందలు వేస్తున్నారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. భవిష్యత్తులో మీ పతనానికి మీరే గొయ్యి తవ్వుకుంటున్నారని తెలుసుకోండి అంటూ వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -