నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా సమాజానికి కొన్ని సూచనలను తెలుపుతూ ఎంతో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తాజాగా తన అభిమానుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉండడంతో ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేణుదేశాయ్ ఇంస్టాగ్రామ్ వేదికగా కోవిడ్ పేషెంట్లకు ప్లాస్మా, ఆక్సిజన్, మందులు, బెడ్లు వంటి సౌకర్యాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారు. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో మెసేజ్ పెట్టిన వారికి వెంటనే స్పందించి వారికి సరైన సమయంలో సహాయం చేస్తున్నారు.
Also read:నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబో సక్సెస్ ఫుల్ సినిమాలు?
కొంతమంది ఆకతాయిలు రేణుదేశాయ్ కి ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా హాయ్, హలో అంటూ మెసేజ్ లు పెట్టడం వల్ల ఆపదలో ఉన్న వారికి సహాయం చేయలేకపోతున్నానని, దాని వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ అభిమానుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు హాయ్ హలో అని మెసేజ్ చేయటం వల్ల సాయం కోసం పంపుతున్న వారి మెసేజ్ లు కిందకు వెళ్లి పోతున్నాయి. ఈ క్రమంలోనే నేను వాటిని చూడలేక పోవటంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ఎవరు నాకు సరదా మెసేజ్ లు చేయకండి అంటూ రేణు దేశాయ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ తెలిపిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read:సమంత, నాగచైతన్య కాంబోలో సినిమా.. ఫ్యాన్స్ కు పండగే?