నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబో సక్సెస్ ఫుల్ సినిమాలు?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. వారి కాంబినేషన్లో వచ్చే సినిమాల కోస అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్నే హీరో నాగార్జున, దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి. వీళ్ల కాంబినేషన్‌లో మొత్తంగా ఆరు సినిమాలు నిర్మించగా ,దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాలనే చెప్పాలి.

అక్కినేని నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం ‘కిరాయి దాదా’. హీరోగా నాగార్జున కు మంచి గుర్తింపునిచ్చిన మూవీ. రెండో చిత్రం ‘విక్కీదాదా’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ గా నిలిచింది.వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే. ఈ సినిమా నాగేశ్వర రావు గారితో కలిసి నటించడం విశేషం. అయితే ఈ సినిమాకు ఆశించిన ఫలితం దక్కలేదు. నాలుగో చిత్రం ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి నాగార్జున కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఐదో చిత్రం ‘అల్లరి అల్లుడు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా ‘రాముడొచ్చాడు’. ఈ మూవీ భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

- Advertisement -

Also read:టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిన శ్రద్ధ శ్రీనాథ్.. నిజమేనా?

ప్రస్తుతం నాగార్జున ఈ ఏడాది ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను అందుకున్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయింది. ఇక కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా “బంగార్రాజు” మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీకి సిక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే.

Also read:ఖిలాడీ సినిమా ఓటీటీలో వస్తుందా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -