Sunday, May 12, 2024
- Advertisement -

రేష్మి అందాలు మ‌తి పోగొట్టేలా ఉన్నాయి!

- Advertisement -

జబర్దస్త్ షో తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యాంకర్ రేష్మికి ఇప్పుడు వరస సినిమా అవకాశాలు వస్తున్నాయి. గుంటూర్ టాకీస్ సినిమాలో తన అందాలతో కుర్రకారుని పిచ్చేక్కించిన రేష్మి ఇప్పుడు మరో సారి అలాంటి పనే చేయబోతుంది. తన అందాలతో ప్రేక్షకులను అంతం చేస్తాను అంటుంది. కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అంతం. ఈ సినిమాని ఈనెల 7 విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను వెల్లడించాడు దర్శకుడు కళ్యాణ్ . ఈ చిత్ర కథ పట్టుకొని చాలా మంది దగ్గరకు వెళ్ళాను.

కానీ ఎవరు కూడా నాతో సినిమా చేయడానికి ముందుకు రాకపోవడంతో నేనే సొంతంగా చిత్ర నిర్మాణంలోకి దిగానని, అందరి సహకారంతో చిత్ర నిర్మాణం పూర్తి చేసానని ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాకు మంచి హైప్ వచ్చిందని దాంతో అన్ని ఏరియాలు అమ్ముడు పోయాయని ఖచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని కళ్యాణ్ అన్నారు. ఇక రేష్మి , చరణ్ దీప్ , వాసుదేవ్ , సుదర్శన్ ముఖ్యతారలుగా వస్తున్నఈ సినిమాకి రేష్మి గ్లామర్ హైలెట్ గా నిలిస్తుందని అంటున్నారు. మరి ఈ అంతం చిత్రం రేష్మికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. 

{youtube}v=MqYccgIfNt4{/youtube}

Related

  1. ఇంటికి వస్తే స్వర్గం చూపిస్తానంటున్న రేష్మి!
  2. రేష్మి కేక పుట్టిస్తుంది..!!
  3. రేష్మీ రెచ్చిపోతోంది .. అందాల విందు
  4. రష్మీ గౌతమ్ అంతం…ఫస్ట్ లుక్ విడుదల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -