మెగాస్టార్ చింజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో ఫర్వాలేదని అనిపించుకున్నాడు కల్యాణ్ దేవ్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన రెండో సినిమాను మొదలుపెట్టాడు కల్యాణ్ దేవ్.పులి వాసు దర్శకత్వంలో రెండో సినిమాను నటించడానికి రెడీ అవుతున్నాడు .తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ను ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్. ఈ సినిమాలో కల్యాణ్ దేవ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తిని తీసుకున్నారని తెలుస్తోంది. రియా చక్రవర్తి తెలుగులో కూడా ఓ సినిమాలో నటించింది.
‘తూనీగా తూనీగా’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ భామ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ కావడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కొన్ని సినిమాలలో నటించి బాగానే ఫేమస్ అయింది. రియా చక్రవర్తి సినిమాలలో కన్నా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్ అయిందని చెప్పాలి. రియా చాలా పొదుపుగా డ్రెస్ వేసుకుంటుంది. ఎక్కువుగా బికినిలలోనే దర్శనం ఇస్తు కుర్రకారు మతి చెడగొడుతోంది. ఇలా బికినిల ద్వారనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. మరో సారి తెలుగు సినిమాలో నటిస్తున్న రియాకు ఈ సినిమా అయిన హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
- ‘కాంచన 4’ లో లేడీ సూపర్ స్టార్!
- వంతెన మీద నుండి యువతిని తోసేశారు.. వీడియో వైరల్!
- రష్మికను కాపాడిన కృతి సనన్..!
- విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు?
- బీఆర్ఎస్లో మరో వర్కింగ్ ప్రెసిడెంట్?
