మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం వినయ విధేయ రామ. రంగస్థలం వంటి హిట్ సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడం పైగా , ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమా యూఎఈ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. సినిమా అద్భుతంగా ఉందని సెన్సార్ వారు కితాబు ఇచ్చారట. సినిమా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని, అదే సమయంలో ఫ్యామిలీ ఎమెషన్స్‌ను బాగున్నాయని సెన్సార్ బోర్డులోని ఓ వ్యక్తి తెలిపారు.
రామ్ చరణ్ సినిమాలో ఇరకొట్టేశాడట. ఇంతక ముందు సినిమాలలో కన్నా ఈ సినిమాలో రామ్ చరణ్ బాగా నటించాడని ఆ సభ్యుడు తెలిపారు.సినిమాలో విలన్ క్యారెక్టర్ బలంగా లేకపోవడం సినిమాకు మైనస్ అని తెలుస్తోంది. సినిమాలో ఫైట్ సీన్స్ హైలెట్ కానున్నాయని సమాచారం. కియారా అద్వానీ అందాలు సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా చూస్తున్నంత సేపు బోయపాటి గత సినిమాలు గుర్తుకు వస్తాయని సమాచారం. ఏది ఏమైనప్పటికి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
- ‘ముందు కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం..’
- వైజాగ్‌తో నాది విడదీయరాని బంధం: అల్లు అర్జున్
- శ్రీలంకతో తొలి టెస్టుకు సర్వం సిద్ధం!
- రేణుకాస్వామి హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు!
- అనాథ అవుతుందని.. భార్యను హతమార్చి..
