Thursday, March 28, 2024
- Advertisement -

మరో రికార్డు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్

- Advertisement -

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండు వారాల్లో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది. రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రంగా ట్రిపుల్ ఆర్ నిలువడం విశేషం. ఈ రికార్డు సొంతం చేసుకున్న తొలి భారతీయ చిత్రం దంగల్ కాగా.. రెండో సినిమా బాహుబలి-2.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా సినిమా యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకుల్ని అలరించేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. మీరు వెలకట్టలేని ప్రేమను పంచారు. అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుతంగా నటించారు. డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సోనాలి

మళ్లీ తెరపై చిరు విశ్వరూపం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -