Friday, May 3, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ పై కీలక ప్రకటన.. నిరాశలో అభిమానులు

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7ప విడుదల చేయాల్సి ఉంది.

ఇందుకోసం దేశ వ్యాప్తంగా సినిమా యూనిట్ సభ్యులు ప్రమోషన్ ఈవెంట్ లను కూడా నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. రాత్రి పూట కర్ఫ్యూ లాంటివి విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదల తేదీపై చిత్ర యూనిట్ పునరాలోచనలో పడింది.

దీంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సినిమా నిర్మాత దానయ్య కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు నేపథ్యంలో సినిమాను వాయిదా వేయాల్సివచ్చిందని, అభిమానులు అర్థం చేసుకోవాలని కోరారు. అతి త్వరలోనే ప్రేక్షకులు ముందుకు మరో తేదీతో వస్తామని అప్పటి వరకు నిరాశకు గురికావద్దని ట్వీట్ చేశారు దానయ్య.

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -