Thursday, April 25, 2024
- Advertisement -

సింహాలు అంత‌రించిపోతాయా?

- Advertisement -

సింహాల‌కు ఆల‌వాల‌మైన ఆఫ్రికాలో వాటి మ‌నుగ‌డ‌కు ముప్పు ఏర్ప‌డుతోంది. అక్క‌డి మంత్ర‌గాళ్లు త‌మ క్షుద్ర ప్ర‌యోగాల్లో సింహాల శ‌రీర‌భాగాల‌ను విచ్చ‌ల‌విడిగా వాడుతుంటారు. వాటిని ఎంత ధ‌రైనా చెల్లించి కొంటుంటారు. సింహాల శ‌రీర‌భాగాల‌కు డిమాండు పెరుగుతుండ‌టంతో ఆఫ్రిక‌న్ వేట‌గాళ్లు య‌థేచ్ఛ‌గా సింహాల‌ను వేటాడుతున్నారు.

ఉచ్చులు ప‌న్న‌డం, తుపాకుల‌తో కాల్చ‌డ‌మే కాకుండా, వాటిపై విష‌ప్ర‌యోగాలు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా, సింహాల శ‌రీర‌భాగాల‌తో త‌యారుచేసే సంప్ర‌దాయ ఔష‌ధాల‌కు ఆగ్నేయాసియా దేశాల్లో విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. వీటితో అక్క‌డి నాటువైద్యులు మ‌గ‌సిరిని పెంచే మందులు త‌యారు చేస్తార‌ట‌.

ఈ వ్య‌వ‌హారంపై అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నా, సింహాల ర‌క్ష‌ణ కోసం ఆఫ్రిక‌న్ దేశాల ప్ర‌భుత్వాలు పెద్ద‌గా ప‌ట్టించుకుంటున్న దాఖ‌లాల్లేక‌పోవ‌డం విచార‌క‌రం.

హై అలర్ట్‌ .. థర్డ్‌ వేవ్‌ వచ్చేసింది

ఆర్ఆర్ఆర్ పై కీలక ప్రకటన.. నిరాశలో అభిమానులు

బాలకష్ణ నెక్ట్స్‌ మూవీలో విలన్ గా స్టార్ హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -