Saturday, April 27, 2024
- Advertisement -

మళ్లీ వాయిదా పడిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ .. కారణం ఆ సీన్లే..?

- Advertisement -

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న”ఆర్ఆర్ఆర్”గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితులలో ఈ సినిమా విడుదలకు నోచుకోలేక పోయింది.అయితే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ వేసవి సెలవులకు సినిమా విడుదల చేయాలని భావించారు. అది కూడా కుదరకపోవడంతో దర్శకుడు దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అధికారిక ప్రకటన చేశారు. ఈ సారి అనుకున్న తేదీకి సినిమా విడుదలను తప్పకుండా చేస్తామని గట్టి నమ్మకంతో చిత్ర బృందం చెప్పడంతో అభిమానులు ఈ సినిమాపై ఆశలు పెంచుకున్నారు.

అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న “ఆర్ఆర్ఆర్” సినిమాపై చిత్ర యూనిట్ మరోసారి షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఈ చిత్రంలో ఓ కీలకమైన సన్నివేశం షూటింగ్ వాయిదా పడింది.అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఓ భారీ సెట్‌లో సినిమాలో అతి కీలకమైన సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉందట. దీంతో సినిమా విడుదల మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం వినబడుతోంది.

Also read:బన్నీ కథలో ఎన్టీఆర్.. మరోసారి స్టూడెంట్ పాత్రలో!

ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వ్యాపించిన కరోనా కేసులు తీవ్రత తగ్గి ఆ తర్వాత ఈ షూటింగ్ జరుపుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేసరికి వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం వినిపించడంతో అభిమానులు ‘జక్కన మాకేంటి గోలా’ అంటూ ఎంతో నిరాశ చెందుతున్నారు.

Also read:ప్రజలకు వరుణ్ తేజ్ సలహాలు.. వైరల్ పోస్ట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -