Wednesday, May 15, 2024
- Advertisement -

బాల‌య్య తో మహేష్ సినిమా!

- Advertisement -
balakrishna mahesh multi starrer

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ మూవీల‌కు ఉండే క్రేజే వేరు. సహజంగా హీరో,డైరెక్టర్ కాంబినేషన్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. దానికి తోడు మల్టీ స్టార్స్ తో పాటు క్రేజీ డైరెక్టర్ కూడా తోడయితే ఆ సినిమా అంచనాలు ఊహకు కూడా అందవు. ఇక ఈ త‌రంలో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు చాలా త‌క్కువ మంది హీరోలు మాత్ర‌మే ముందుకు వ‌స్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ గురించి టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

మహేష్ బాబుతో శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రీసెంట్‌గా ఎన్టీఆర్‌తో కూడా జ‌న‌తా గ్యారేజ్ లాంటి ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చాడు. గ్యారేజ్ త‌ర్వాత కొర‌టాల మ‌ళ్లీ మ‌హేష్‌తో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెకండాఫ్‌లో కీల‌కంగా ఉండే ఓ రోల్‌ను సీనియ‌ర్ హీరోతో చేయిస్తే బాగుంటుంద‌ని కొర‌టాల భావిస్తున్నాడ‌ట‌.

ఈ సినిమాను ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్టుగా తెర‌కెక్కించాల‌ని భావిస్తున్న కొర‌టాల అందుకోసం ఆ రోల్‌ను బాల‌కృష్ణ‌తో చేయిస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈ విషయమై కొరటాల శివ, మహేష్ బాబు కలిసి బాలకృష్ణ తో సంప్రదించటం కూడా జరిగిందని దానికి బాలకృష్ణ కూడా ఓకే చెప్పారని ఫిలిం నగర్ టాక్. ఈ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తే నంద‌మూరి – ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండ‌దు. ఇక ఈ మూవీ రికార్డుల సునామీ క్రియేట్ చేయ‌డం ఖాయం.

Related

  1. పవన్ దెబ్బకి షాక్ లో ఉన్న మ‌హేష్‌ బాబు!
  2. ముఖ్య‌మంత్రి కాబోతున్న మ‌హేష్‌బాబు!
  3. రాజమౌళి కి మంచులక్ష్మి కి మధ్య ఏం జరిగింది?
  4. సుధీర్‌తో ఎఫైర్‌ గురించి ర‌ష్మీ ఏమంటుందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -