మలయాళ ”ప్రేమమ్” చిత్రంలో మలర్ క్యారెక్టర్‌తో బాగా ఫేమస్ అయ్యింది అందాల భామ సాయి పల్లవి. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఈ అమ్మడుకి వరస అవకాశాలు వస్తున్నాయి. అయితే సాయి పల్లవి ఓ హీరోని తెగ ప్రేమిస్తుందట. ఆ హీరో కనిపిస్తే.. ఐ లవ్ యు అని చెప్పేస్తానని ఇటివలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించింది.
సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఫిదా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. పక్కా తెలంగాణ అమ్మాయిగా ఈ చిత్రంలో సాయి పల్లవి కనిపించనుంది. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరివేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మెడిసిన్ చదివిన సాయి పల్లవి తాను స్కిన్ షో కి దూరమని స్పష్టంగా చెబుతోంది. అయిన కానీ సాయి పల్లవికి అవకాశాలు వస్తునే ఉన్నాయి.
రీసెంట్ గా ‘జస్ట్ ఫర్ విమెన్’ మ్యాగజైన్ కవర్ పేజిపై మెరిసింది. ఆ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఆసక్తికర సంగతులను చెప్పింది. “నేను సూర్యకి వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించాలని ఉంది. అది కుదురుతుందో లేదో కానీ కచ్చితంగా అతన్ని కలుస్తా. కలిసినప్పుడు మాత్రం ఐ లవ్ యూ చెప్పేస్తా” అని సాయి పల్లవి తన మనసులోని మాటను బయట పెట్టింది.
Related
