Sunday, April 28, 2024
- Advertisement -

మరోసారి మంచి మనసు చాటుకున్న సల్మాన్ ఖాన్

- Advertisement -

గత ఏడాది కరోనా కష్ట కాలంలో సినీ తారలు ఎంతో మందికి ఆర్థిక సహాయం, ఇతర సహాయాలు అందించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదో ఒక సహాయాన్ని ప్రజలకు అందిస్తూ.. అందరి మన్ననలు పొందుతున్న సోనూ సూద్ గురించి ప్రత్యేకంగ చెప్పనక్కరలేదు. గత ఏడాది సినీ కార్మికుల కోసం పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ కష్టాల్లోకి వెళ్లింది.

తాజాగా సల్మాన్ ఖాన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో సినీ కార్మికులకు కొద్ది మొత్తంలో ఆర్థికసాయం చేయాలని స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నారు.చిత్ర పరిశ్రమలోని 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. సినీ పరిశ్రమలో రోజువారీ వేతనంపై పనిచేసే కార్మికులు ప్రస్తుతం షూటింగ్ లు లేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ విషయం తెలుసుకొని సల్మాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్ మేనేజర్ ఇటీవల సినీ కార్మికుల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్)ను సంప్రదించి, కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాలను కోరారు.సినీ కార్మికుల సమాఖ్య తమ వద్ద పేర్లు నమోదు చేయించుకున్న కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాలను అందించింది. సల్మాన్ గతేడాది కూడా కరోనా సమయంలో ఇలాగే ఆర్థికసాయం అందించారు.

ఏపీలో కరోనా కల్లోలం… 73 మరణాలు.

నాగార్జున సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే?

ఖమ్మం మేయర్, డిప్యూటీ మేయర్లు వీరే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -