Friday, March 29, 2024
- Advertisement -

ఏపీలో కరోనా కల్లోలం… 73 మరణాలు..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వికృతరూపం కొనసాగుతూనే ఉంది. నిత్యం పరీక్షలు పెరిగే కొద్దీ కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూస్తునే ఉన్నాయి. అంతే స్థాయిలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో 1,00,424 కరోనా పరీక్షలు నిర్వహించగా 17,188 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,260 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 1,868 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 385 కేసులు వెల్లడయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 12,45,374 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10,50,160 మంది కోలుకున్నారు. ఇంకా 1,86,695 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కరోనా మృతుల సంఖ్య 8,519కి పెరిగింది. ఏపీలో కరోనా కేసులు.. తాజా పరిస్థితిపై శుక్రవారం ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచామని ఆయన తెలిపారు.

ఇక ఆరోగ్యశ్రీ కార్డులున్న వారికి ప్రైవేటు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం అందిస్తామని వివరించారు. కోవిడ్ బాధితులకు ఎలాంటి వైద్య సదుపాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -