Friday, April 19, 2024
- Advertisement -

మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్

- Advertisement -

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ సమంత మరింత జోరు పెంచింది. బాలీవుడ్​, టాలీవుడ్, కోలీవుడ్​ అన్న తేడా లేకుండా వచ్చిన ప్రతి ఆఫర్‌కు ఓకే చేసేస్తోంది. ఒకపక్క సినిమాలు.. మరోపక్క వెబ్‌ సిరీస్‌లు, ఇంకోవైపు ఐటమ్ సాంగ్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా మరో బిగ్ స్టార్‌తో సినిమాకు సమంత ఓకే చెప్పిందని సమాచారం. దీనిపై ఇక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ నుంచి సమంతకు ఓ ఆఫర్ వచ్చిందట. తమిళ స్టార్ హీరో కార్తీ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఫైనల్ చేశారని టాక్. ఈ మేరకు సామ్‏తో మేకర్స్ సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ సినిమాను తమిళ హిట్ చిత్రం ‘బ్యాచిలర్​’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సతీష్ సెల్వకుమార్​ దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్​ రెడీ అయిందట. ఇందులో హీరోయిన్ రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుందని టాక్.

ప్రస్తుతం సమంత ‘యశోద’ సినిమాలో నటిస్తోంది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హరి, హరీష్‌ సినిమాకు దర్శకులు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా సామ్ ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్‌పై సామ్ ఫోకస్ పెట్టింది. హిందీలో రెండు ప్రాజెక్టులతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

విజ‌య్ షాకింగ్ రెమ్యూన‌రేష‌న్

నెగటివ్‌ రోల్‌లో నాగ చైతన్య

బోయపాటి తర్వాత సినిమా అల్లు అర్జున్‌తో కాదా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -