Friday, March 29, 2024
- Advertisement -

మాస్టర్ హీరోయిన్‌ పంట పండింది

- Advertisement -

తంతే బూర్ల గంపలో పడ్డాడని వెనకటికి ఓ సామెత. ప్రస్తుతం హీరోయిన్ మాళవికా మోహనన్ పరిస్థితి అలాగే ఉంది. ఈ మలాయళ భామను మెగా అవకాశం పలకరించనుందని సమాచారం. మెగాస్టార్‌ చిరంజీవి కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. మాళవికా మోహనన్‌ రజినీకాంత్‌ నటించిన ‘పెటా’, విజయ్‌ ‘మాస్టర్‌’ చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల ద్వారా తెలుగు వారికీ పరిచయం అయ్యింది.

‘మాస్టర్‌’ చిత్రంలో చారులత క్యారెక్టర్‌ తో ఇక్కడి ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది మాళవికా. తన అందచందాలతో పాటు నటనతోనూ మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలు ఉంటారని తెలుస్తోంది. ఇందులో ఒక హీరోయిన్‌గా మాళవికాను తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం మాళవికా మోహనన్‌ తమిళంలో ధనుష్‌ సరసన ‘మారన్‌’, ‘యుద్ర’ అనే చిత్రాల్లో నటిస్తోంది.

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’, కేఎస్‌ రవీంద్ర దర్శకత్వంలో ఓ సినిమా, మోహన్‌ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్‌ 29న విడుదలకు సిద్ధమవుతోంది.

భీమ్లానాయక్‌పై రామ్‌గోపాల్ వర్మ హాట్ కామెంట్స్

రాజ‌శేఖ‌ర్ ను సినిమా నుంచి ఎందుకు త‌ప్పించారు ?

తెర‌పై రీఎంట్రీ ఇస్తున్న ప‌వ‌ర్ స్టార్ మాజీ భార్య‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -