Friday, May 17, 2024
- Advertisement -

సిద్ధార్థ్ వ్యవహారం గురించి నిజాలు చెప్పిన సమంత!

- Advertisement -

స్టార్ హీరోయిన్స్ తమ గత జీవితంలోని ప్రేమ వ్యవహారాలను గురించి పెద్దగా మాట్లాడరు. అయితే సమంత మాత్రం సిద్దార్థ్ ప్రేమ బ్రేకప్ వ్యవహారాల గురించి కూడ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ మ్యాగజైన్ ‘సౌత్ స్కోప్’ కు ఈమధ్య సమంత ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత చాల ఓపెన్ గా మాట్లాడింది.

తాను సిద్ధార్థ్ తో ప్రేమ వ్యవహారం నడిపిన విషయం అదేవిధంగా బ్రేకప్ అయిన విషయం ఇలా అన్ని విషయాలు నాగచైతన్యకు ఎటువంటి దాపరికాలు లేకుండా తాను చెప్పానని కామెంట్ చేసింది సమంత. అంతేకాదు గత కొంత కాలంగా తన జీవితంలో జరుగుతున్న ప్రతి మూమెంట్లోనూ చైతూ ఉన్నాడని చెపుతూ తనకు ప్రొఫెషనల్ గా  పర్సనల్ గా ఇబ్బందులు ఎదురైనపుడు తనకు చైతన్య అండగా ఉన్నాడన్న విషయాన్ని బయట పెట్టింది సమంత.  తన పాత రిలేషన్షిప్స్ మాత్రమే కాదు నాగచైతన్య పాత రిలేషన్ షిప్స్ కూడ తనకు తెలుసు అని మరో ట్విస్ట్ ఇచ్చింది ఈ మాయలేడి.

దీనితో ఈ ఇంటర్వ్యూ చదివేవారికి మాత్రం సమంత మాజీ ప్రియుడు ఎవరు అన్నది తెలిసినా చైతూ గతంలో ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అని అనుమానం కలగడం సహజం. ఏది ఏమైనా ఎటువంటి దాపరికాలు లేకుండా సమంత మాట్లాడిన తీరు ‘సౌత్ స్కోప్’ మ్యాగజైన్ ఇంటర్వ్యూకు హైలెట్ గా నిలిచింది.. ఇక చైతూతో పెళ్లి అయ్యేలోపు ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్ని విషయాలు చెపుతుందో చూడాలి.

Related

  1. సమంతా – నాగ చైతన్య లో ఎవరు ముందు ప్రపోజ్ చేసారు
  2. ఏంటి ఇది సమంతకు రెండో వివహమా?
  3. మొత్తానికి ప్రేమపై అసలు నిజం చెప్పిన సమంత
  4. సమంత – చైతన్య ల లవ్ స్టోరీ చెప్పిన దాసరి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -