Thursday, May 2, 2024
- Advertisement -

సంపూ ‘క్యాలీఫ్ల‌వ‌ర్’ టీజర్ రిలీజ్

- Advertisement -

సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రల్లో నటించాడు. గత ఏడాది కొబ్బరి మట్ట చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మధుసూదనా క్రియేషన్స్ “కాలీఫ్లవర్” సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు అంతేకాకుండా ఈ సినిమాలోని సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ బ్యాంగ్ వీడియో గా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంపూర్ణేష్ ఇంగ్లీష్ మేన్ గా దర్శనం ఇవ్వటం విశేషం.

పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆర్.కె మలినేని దర్శకత్వంలో ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. గూడురు శ్రీధర్ సమర్పకునిగా వ్యవహరించనున్నారు. వాసంతి హీరోయిన్ గా నటించే ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు. ముజీర్ మాలిక్ కెమెరామేన్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇటీవల లాంఛనంగా మొదలైంది.

ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీతోపాటు సంపూర్ణేష్ బాబు ‘బ‌జార్ రౌడీ’ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మహేష్, గెటప్ శ్రీను, రోహిణి, కాదంబరి, కిరణ్, విజయ్, కళ్యాణి ఇతరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..

సోనూ సూద్ ఫౌండేషన్ కు సారా అలీఖాన్ భారీ విరాళం.. ఎంతంటే?

హమ్మయ్య అంతా సేఫ్.. హిందూ మహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -