Saturday, May 4, 2024
- Advertisement -

ఏపిలో కరోనా కల్లోలం.. 92 మంది మృత్యువాత!

- Advertisement -

ఏపీలో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 92 మంది కరోనాతో మరణించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది, విశాఖ జిల్లాలో 10 మంది మృతి చెందారు. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెలరేగుతుంది. కరోనా మహమ్మారి కారణంగా 92 మంది ప్రాణాలు కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

ఈ మేరకు ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,87,603 కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 8,707 కి పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 8,832 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలరో 1,90,632 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో 1,05,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,164 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 2,844 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉండటం వల్ల 45 ఏళ్లు మించిన వారికే వాక్సిన్ వేసేందుకు కేంద్రాన్ని అనుమతి కోరామని తెలిపారు. తమ వినతికి కేంద్ర సానుకూలంగా స్పందించిందని సింఘాల్‌ పేర్కొన్నారు. కావున దీనికి అనుగుణంగా మరో రెండు రోజుల్లో కొవిన్‌ వెబ్‌ పోర్టల్‌లో మార్పులు చేస్తామని వెల్లడించారు.

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..

సోనూ సూద్ ఫౌండేషన్ కు సారా అలీఖాన్ భారీ విరాళం.. ఎంతంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -