Thursday, March 28, 2024
- Advertisement -

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..

- Advertisement -

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడిపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సమయంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి.. అయితే సీఎం కేసీఆర్ మాత్రం లాక్ డౌన్ అవసరం లేదంటున్నారు.. కాకపోతే ప్రజలు కరోనా నియంత్రణ విషయంలో సీరియస్ గా ఉండాలని తెలిపారు.

నైట్ కర్ఫ్యూని మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కఠినంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. మే15 ఉదయం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటుందని అన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వైద్య శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 55, 358 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,976 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 851 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 7,646 మంది కరోనా నుంచి కోలుకోగా, 35 మంది మరణించారు. ఇప్పటివరకు తెలంగాణలో 4,97,361 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 4,28,865 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

సోనూ సూద్ ఫౌండేషన్ కు సారా అలీఖాన్ భారీ విరాళం.. ఎంతంటే?

విజయ్ దేవరకొండ బ్యాడ్ న్యూస్.. ‘లైగర్’ టీజర్ వాయిదా!

అమ్మ కోసమే పుట్టిన అద్భుత పాటలు.. వింటే మైమర్చిపోతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -