Thursday, May 2, 2024
- Advertisement -

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ కొత్త చిత్రం!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో హీరో,కమెడియన్ ఎలాంటి క్యారెక్టర్ అయిన తనదైన స్టైల్లో నటించి మెప్పించే నటుడు బ్రహ్మాజీ. కెరీర్ బిగినింగ్ లో హీరోల ఫ్రెండ్స్ గా నటించిన ఆయన కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు. ఎలాంటి పాత్ర అయినా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా ‘పిట్టకథ’ మూవీతో పరిచయం అయ్యారు.

ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా వి.ఎస్. ఫణీంద్రన్ దర్శకత్వంలో నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కమ్మరి. రవికుమార్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెo.1 చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్ మొదలు కాబోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనది ప్రేమా? పెళ్ళా? అనే కథాంశంతో.. లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతునన్నట్లు దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.

ఈ చిత్రంలో రోహిణి ముంజల్, సాధన హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజా రవీంద్ర, ప్రభాస్ శ్రీను, హేమ, ప్రగతి వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.

మన ప్రాణాలు కాపాడుకోవాలంటే.. ప్రభుత్వానికి సహకరించండి : కీర్తి సురేష్

నటుడు సోనుసూద్ కి నోటీసులు జారీ చేసిన ముంబై హైకోర్టు?

బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్న సత్యదేవ్!

Watch: ‘వైయస్‌ జగన్‌ అనే నేను..’ సంక్షేమ సంతకానికి రెండేళ్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -