Friday, April 26, 2024
- Advertisement -

మన ప్రాణాలు కాపాడుకోవాలంటే.. ప్రభుత్వానికి సహకరించండి : కీర్తి సురేష్

- Advertisement -

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా గురించిన మాటలే మాట్లాడుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో కరోనా గురించిన చర్చలే నడుస్తున్నాయి. గత నెలలో దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా నాలుగు లక్షల కేసులు, నాలుగు వేల మరణాలు నమోదు అయ్యాయి. అయితే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. తాజాగా కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ విధిగా సహకరించాలని సినీ నటి కీర్తి సురేష్‌ విజ్ఞప్తి చేశారు.

ప్రజల సహకారంతోనే కరోనా నియంత్రణ సాధ్యమన్న విషయాన్ని ఎవరూ విస్మరించొద్దని ఆమె పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రజల్లో అవగహన పెంచేందుకు సినీ తారలు కూడా తమ వంతు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దు. అత్యవసర పనులు ఉంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటపుడు ఖచ్చితంగా డబుల్‌ మాస్క్‌ ధరించండి. సామాజిక భౌతికదూరాన్ని పాటిస్తూ, చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలి. ప్రధానంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. ప్రస్తుతం మనం కనిపించని శత్రువుతో పోరాటం కొనసాగిస్తున్నామని అన్నారు. అంతిమ విజయం మనదే అవుతుందని ఆమె తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కబలించే ప్రమాదం ఉందని, ఈ క్రమంలో ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఏకంగా తనని టైటానిక్ హీరోయిన్ తో పోల్చుకున్న యంగ్ హీరో .. ఫోటో వైరల్!

మరో మైలు రాయిని దాటిన యంగ్ టైగర్ ఎన్టీఆర్!

మా అమ్మ ఎదురుగానే ఆ నిర్మాత ఎంతో అసభ్యంగా మాట్లాడాడు:కిష్వర్ మర్చంట్

Watch: ‘వైయస్‌ జగన్‌ అనే నేను..’ సంక్షేమ సంతకానికి రెండేళ్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -