కన్నీళ్ళతో పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొన్నసప్తగిరి!

Saptagiri Emotional Speech in Saptagiri Express Audio Launch

కమెడియన్  సప్తగిరి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. ఈ సినిమాకి అరుణ్ పావర్ దర్శకత్వంలో శ్రీసాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్‌పై డా. రవి కిరణ్ నిర్మించారు. రోషిణి హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ బుల్గానిక్ అందించిన పాటల సీడీని పవన్‌కల్యాణ్ విడుదల చేశారు.

సప్తగిరి మాట్లాడుతూ… చిన్నప్పట్నుంచి చిరంజీవిసార్‌ను అభిమానిస్తూ పెరిగా. నిజాయతీ గల అభిమానిని కాబట్టే పవన్‌సార్ వచ్చారు’’ అని సప్తగిరి అన్నారు. కమెడియన్ సప్తగిరి మైక్ పట్టుకున్న మరుక్షణం నేరుగా వెళ్లి పవన్ కళ్యాణ్ కాళ్ళపై పడిపోయాడు. మైక్ పట్టుకుని మాట్లాడుతున్నంత సేపు ఎంతో భావోద్వేగానికి గురైన సప్తగిరి, తన కంట కన్నీరు వచ్చేస్తోంది, అయినా ఆపుకుంటున్నాను… మాటలు రావడం లేదంటూ ప్రసంగించాడు సప్తగిరి.

నాకు మాటలు రావడం లేదు, మొత్తం పవర్ స్టారే ఆవహించేసారు, సినిమాల్లో చూస్తే ఒక కుర్రాడిలా, సడెన్ గా హెల్ప్ చేస్తూ గడ్డం పెంచి మర్యాదస్తుడైన ఒక యోగిలా కనపడతాడు, రాజకీయ వేదికపైన చూస్తే ఒక చరిత్ర సృష్టించే వ్యక్తి మాదిరి ఉంటారని, ఇంతవరకు తానూ చరిత్ర సృష్టించిన వ్యక్తులను చూడలేదని, కానీ పవన్ కళ్యాణ్ రూపంలో భవిష్యత్తులో ఎన్నో సంచలనాలను, విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చే వ్యక్తి మన వెనుక నిలబడ్డాడు…. అంటూ పవర్ స్టార్ ను ఆకాశంలోకి ఎత్తేసారు. ఇక ‘‘సినిమా ఎలా తీయాలో త్రివిక్రమ్‌సార్ దగ్గర నేర్చుకున్నా. నన్ను ఆశీర్వదించడానికి పవన్ సార్ వచ్చినందుకు హ్యాపీ’’ అని  దర్శకుడు అన్నారు. ‘‘తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ ఇది’’ అని డా. రవి కిరణ్ అన్నారు.

{youtube}T5kR6XlaXww{/youtube}

Related

  1. పవన్ అలా అడుగు పెడితే ప్రభంజనమే..
  2. జనసేనలో మొదటిసారిగా పవన్ ఇలా..
  3. చిరు ఎంట్రీ ఇస్తుంటే .. పవన్ ఎగ్జిట్ కానున్నాడా..?
  4. పవన్ ను నయనతార అంత మాట అనేసిందా?