Saturday, April 20, 2024
- Advertisement -

రజినీని ఢీ కొట్టబోతున్న జగ్గూభాయ్ !

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకున్న ప్రత్యేకతే వేరు. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులకు ప్రతి రోజూ పంగడే. ప్రస్తుతం ఈ స్టార్ ‘అన్నాత్తె’ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. కాగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు శివ డైరెక్షన్ వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.

ఈ మూవీ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ ట్విట్టర్ వేధికగా ఈ ఆసక్తికరమైన విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేసింది. ఇంతకి అసలు విషయం ఏమిటంటే.. విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్ననటుడు జగపతి బాబు .. రజినీ కాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నారట. అన్నాత్తె టీంలో జగ్గుబాయ్ జాయిన్ అయ్యాడని తెలిపింది ఈ చిత్ర నిర్మాణ సంస్థ.

రజినీ కాంత్, జగపతి కాంబినేషన్ లో ఇప్పటికే 2 సినిమాలు కూడా వచ్చాయి. ఇది ముచ్చటగా మూడో సినిమాగా నిలవనుంది. ఇక ఇందులో ఈ జగ్గుబాయ్ విలన్ గా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ రెగ్యురల్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసింది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ దీపావళి దమాఖాగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీరి కాంబినేషన్ సూపర్ హిట్టే..!

ఆ విషయంలో నేను బాలయ్యకు ఫిదా అయ్యాను

కిడ్నీలల్లో రాళ్లా.. అయితే ఇవి అస్సలు తినకండి !

బాగా చెమ‌ట ప‌డుతుందా..? ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

నాగార్జున‌కు కాజ‌ల్ గ్రీన్‌సిగ్న‌ల్ !‌

ర‌జినీ కాంత్ సినిమాపై క‌రోనా దెబ్బ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -