Tuesday, April 30, 2024
- Advertisement -

ఈ నెల 26 భార‌త్ బంద్

- Advertisement -


కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన మూడు నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైత‌న్న‌లు చేస్తున్న ఉద్య‌మం ఉధృతంగా కొన‌సాగుతోంది. అన్న‌దాత‌ల నిర‌స‌న‌ల‌తో దేశ‌రాజ‌ధాని స‌రిహ‌ద్దులో నిర‌స‌న‌ల‌తో హోరెత్తుతున్నాయి. అలాగే, ఉత్త‌రాధితో పాటు దక్షిణాది రాష్ట్రాల‌లో రైతు మ‌హా పంచాయ‌తీల‌తో అన్నదాతలు త‌మ గ‌ళాన్ని వినిపిస్తూనే ఉన్నారు.

ఈ నేప‌థ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన నూత‌న మూడు వివాద‌స్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఈ నెల 26న (మార్చి 26) భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్‌) ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని వ‌ర్గాలు ఈ బంద్‌కు స‌హక‌రిస్తూ.. రైతుల‌కు అండ‌గా నిల‌వాల‌ని ఎస్‌కేఎం కోరింది.

హోలీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వివాదాస్ప‌ద నూత‌న సాగు చ‌ట్టాల ప్ర‌తుల‌ను ద‌హ‌నం చేస్తామ‌ని రైతు సంఘాల నాయ‌కులు పేర్కొన్నారు. భార‌త్ బంద్ గ్రామస్థాయి నుంచి విజ‌య‌వంతం చేయ‌డానికి అంద‌రూ కృషి చేయాల‌ని అలిండిమా కిసాన్ స‌భ నాయ‌కుడు కృష్ణ‌ప్ర‌సాద్ పిలుపునిచ్చారు. కాగా, కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేస్తున్న ఉద్య‌మం 112 రోజుల‌కు చేరింది.

రజినీని ఢీ కొట్టబోతున్న జగ్గూభాయ్ !

వీరి కాంబినేషన్ సూపర్ హిట్టే..!

ఆ విషయంలో నేను బాలయ్యకు ఫిదా అయ్యాను

కిడ్నీలల్లో రాళ్లా.. అయితే ఇవి అస్సలు తినకండి !

బాగా చెమ‌ట ప‌డుతుందా..? ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -