Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త !

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. ‌ఉభయ స‌భ‌ల‌ను ఉద్దేశించి గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు  రాబోయే రెండు, మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

ప్రభుత్వ ఉద్యోగుల మీద తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని.. వారిపై త‌మ‌కెంత ప్రేమ ఉందో గ‌త పీఆర్సీతోనే చూపించామని సీఎం కేసీఆర్ అన్నారు.  అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటన చేయడంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యోగులకు ఇండియాలో తాము అత్య‌ధిక‌ జీతాలు పొందుతామ‌ని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామ‌ని చెప్పాం.. ఇప్పుడు ఆ హామీని అమ‌లు చేస్తున్నామని పేర్కొన్నారు.

తాను పీఆర్సీ ప్ర‌క‌టించిన త‌ర్వాత ఉద్యోగులు త‌ప్ప‌కుండా హ‌ర్షం చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో  పీఆర్సీ పై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటనతో 29% పీఆర్సీ ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే అన్నట్లు తెలుస్తోంది.

తాడిపత్రి ఛైర్మన్ రసవత్తరం.. రహస్య శిబిరంలో నేతలు…!

ఆ విషయంలో నేను బాలయ్యకు ఫిదా అయ్యాను

బాగా చెమ‌ట ప‌డుతుందా..? ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -