Saturday, April 27, 2024
- Advertisement -

ఏపిలో కరోనా మరణ మృదంగం..

- Advertisement -

ఏపీలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో లాక్ డౌన్ ఉన్నప్పటికీ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం… గడిచిన 24 గంటల్లో 24,171 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. 101 మంది చనిపోయారు.

అత్యధికంగా అనంతపురం జిల్లాలో 14 మంది కన్నుమూయగా, విశాఖ జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 2,885 కేసులు నమోదు కాగా.. 10 మంది మృత్యువాత పడ్డారు, తూర్పు గోదావరి జిల్లాలో 2,876 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2,426 కేసులు, విశాఖ జిల్లాలో 2,041 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 21,101 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు కొనసాగుతున్నాయి.

మొత్తమ్మీద రాష్ట్రంలో ఇప్పటివవరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 9,372కి పెరిగింది. గత 24 గంటల్లో 9 4,550 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,10,436 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, దేశంలో అత్యధిక కేసులు నమోదౌతున్న రాష్ట్రాల్లో ఎపి నిలుస్తుండటం గమనార్హం.

వర్షంలో తెగ ఎంజాయ్ చేసిన అనసూయ!

హీరోయిన్ ని టార్చర్ చేసిన లెక్చరర్.. ఆ గుట్టు అంతా అలా?

మిస్డ్ కాల్ ఇవ్వండి.. ఆక్సిజన్ పంపిస్తానంటున్న సోనూ సూద్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -