Wednesday, April 24, 2024
- Advertisement -

ఫలితం బాగుంది.. అందుకే ఢిల్లీలో లాక్​ డౌన్​ మరో వారం పొడిగింపు : సీఎం కేజ్రీవాల్‌

- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రకటించారు. లాక్ డౌన్ తో ప్రస్తుతం కేసులు చాలా వరకు తగ్గాయని, మహమ్మారి తీవ్రతను మరింతగా తగ్గించేందుకు మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరోనా పాజిటివిటీ రేట్ 5 శాతం కన్నా దిగువకు తీసుకురావడమే లక్ష్యమన్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఈ నెల 17వ తేదీతో ముగియనుండగా.. మరోసారి ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 5 గంటల వరకు పొడగించారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11శాతానికి పడిపోయిందని శనివారం సీఎం ప్రకటించారు. ఏప్రిల్‌ మధ్యలో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతం ఉండగా.. ప్రస్తుతం భారీగా తగ్గింది.

ఇదిలా ఉండగా.. నిన్న ఢిల్లీలో 6,500 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. ఇప్పటిదాకా కరోనా కట్టడిలో చాలా వరకు విజయం సాధించామని, ఇలాంటి సమయంలో మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసులు మళ్లీ పుంజుకుంటాయని అందుకే లాక్ డౌన్ పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

వర్షంలో తెగ ఎంజాయ్ చేసిన అనసూయ!

హీరోయిన్ ని టార్చర్ చేసిన లెక్చరర్.. ఆ గుట్టు అంతా అలా?

మిస్డ్ కాల్ ఇవ్వండి.. ఆక్సిజన్ పంపిస్తానంటున్న సోనూ సూద్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -