Friday, April 26, 2024
- Advertisement -

నటుడు చంద్రమోహన్ పై రూమర్లు.. కొట్టి పడేస్తున్న సన్నిహితులు!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సరిసమానంగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు చంద్రమోహన్. ఓ వైపు హీరోగా నటిస్తూనే తన సహహీరోలకు స్నేహితుడిగా ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు చంద్రమోహన్. గత కొంత కాలంగా తండ్రి, మామ, తాత పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలం నుంచి ఇప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న నటులలో చంద్రమోహన్ ఒకరు. దాదాపు 55 సంవత్సరాల పాటు నటిస్తూనే ఉన్నారు. సీనియర్ నటుడు చంద్రమోహన్ తన పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై సినిమాలలో నటించబోనని ఆయన తేల్చి చెప్పారు. మే 23న చంద్రమోహన్ పుట్టినరోజు. ఆ రోజు ఆయన తన 81వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత విషయాలు గురించి చెప్పుకోచ్చారు. హీరోగా నటిస్తే.. కేవలం 50 సంవత్సరాలు మాత్రమే ఇండస్ట్రీలో ఉండేవాడినని.. కానీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎలాంటి పాత్రలైనా నటించాల్సిందే అని.. అందుకే తాను ఇప్పటి వరకు నటుడిగా కొనసాగుతున్నా అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ‘రాఖీ’ సినిమా షూటింగ్ సమయంలో గుండెనొప్పి రావడంతో బైపాస్ సర్జరీ జరిగింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాధం’ షూటింగ్లో కూడా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డాను అని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సినిమాలు చేయనని చెప్పారు. గత కొద్ది రోజులుగా చంద్రమోహన్ చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన సన్నిహితులు స్పందించారు. ప్రస్తుతం చంద్రమోహన్ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు.

ఆయనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఆయనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాం. గతంలో కూడా ఆయన ఆరోగ్యంపై రూమర్లు సృష్టించారు. అవన్నీ వొట్టి రూమర్లు అని అలాంటి వారిని వెంటనే శిక్షించాలని అన్నారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్, శ్రీమతి శారద ఆకునూరి సంయుక్త మరియు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు సంయుక్త ఆధ్వర్యంలో జూమ్ వీడియో ద్వారా ఈనెల 22 నుంచి రెండు రోజులపాటు చంద్రమోహన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

ఎర్రచందనం కేసులో జబర్ధస్త్ కమెడియన్…

నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ కి కరోనా నెగటివ్

భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -