Thursday, April 25, 2024
- Advertisement -

భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు..

- Advertisement -

గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దేశంలో ప్రతిరోజూ దాదాపు నాలుగు లక్షలకు పైగా కేసులు.. నాలుగు వేల వరకు మరణాలు సంబవించాయి. దాంతో ప్రజల్లో భయం మొదలైంది.. ఇక కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్ డౌన్ మొదలు పెట్టడంతో కరోనా కంట్రోల్ కావడం అవుతూ వచ్చింది. తాజాగా కొత్త కరోనా కేసులు 2 లక్షల దిగువకు వచ్చాయి.

గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మహమ్మారి నుంచి కోలుకుని 3,26,850 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా 3,511 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరోవైపు ఇప్పటి వరకు 19,85,38,999 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇలాగే కొంత కాలం లాక్ డౌన్ సరైన రీతిలో అవలంభిస్తే కరోనా ని పూర్తిగా కట్టడి చేయవొచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో వారి వైద్యసేవలు భేష్ : ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

బాలయ్య పుట్టిన రోజుకు పెద్ద గిఫ్ట్.. ఏంటంటే?

‘ఆచార్య’చరణ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన కొరటాల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -