Friday, April 26, 2024
- Advertisement -

ఏపీలో రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు..!

- Advertisement -

రైతన్నకు అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోన్న ఏపీ ప్రభుత్వం.. ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉచిత పంటల బీమా చెల్లింపుల కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రారంభించారు. గ‌త ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.15 లక్షల మంది రైతుల‌కు రూ.1820.23 కోట్ల బీమా పరిహారాన్ని తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి కంప్యూటర్ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంద‌ని అన్నారు.

గ‌త ఏడాది ఖ‌రీఫ్‌లో భారీ వ‌ర్షాలతో రైతులు న‌ష్ట‌పోయార‌ని చెప్పారు. వారిని ఆదుకునేందుకు తాము ఉచిత పంట‌ల బీమా ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పారు. కరోనా కష్ట కాలంలో ఎంతో మంది రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం 23 నెల‌ల్లో రైతుల కోసం రూ.83 వేల కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని చెప్పారు. గ‌త ఏడాది ఖ‌రీఫ్‌లో భారీ వ‌ర్షాలతో రైతులు న‌ష్ట‌పోయార‌ని చెప్పారు. వారిని ఆదుకునేందుకు తాము ఉచిత పంట‌ల బీమా ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పారు.

రైతు భ‌రోసా కింద ఈ నెల‌లో రూ.3,900 కోట్లు అందించామ‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం గ్రామ స‌చివాల‌యాల‌తో పాటు రైతు భ‌రోసా కేంద్రాల‌ను కూడా ఏర్పాటు చేసింద‌ని జ‌గ‌న్ తెలిపారు. ప్ర‌తి ఆర్బీకే ప‌రిధిలో కోల్డ్ స్టోరేజ్‌లు, గిడ్డంగులు ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. వైఎస్సార్ జ‌ల‌క‌ళ ద్వారా రైతుల‌కు ఉచిత బోర్లు వేయించ‌డంతో పాటు స‌న్న‌, చిన్న‌కారు రైతుల‌కు మోటార్లు కూడా అందిస్తున్నామ‌ని తెలిపారు. పాడి రైతుల‌కు లబ్ధి చేకూర్చేందుకు అమూల్ సంస్థ‌ను తీసుకొచ్చామ‌ని చెప్పారు.

నటుడు చంద్రమోహన్ పై రూమర్లు.. కొట్టి పడేస్తున్న సన్నిహితులు!

ఎర్రచందనం కేసులో జబర్ధస్త్ కమెడియన్…

నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ కి కరోనా నెగటివ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -