Friday, April 19, 2024
- Advertisement -

ఎర్రచందనం కేసులో జబర్ధస్త్ కమెడియన్…

- Advertisement -

ఎర్రచందనంలో స్మగ్లింగ్ కేసులో మరోసారి జబర్దస్త్ కమెడియన్ పేరు తెరపైకి వచ్చింది. జబర్డస్త్ లో లేడీ గెటప్స్ తో పేరు తెచ్చుకున్న హరిపై మరో కేసు నమోదైంది. హరి పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు గతంలో నిర్ధారించగా మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. కొంత కాలం క్రితం ఒక జబర్దస్త్ నటులు ఇద్దరు వ్యభిచారం కేసులో కూడా బుక్కయిన విషయం తెలిసిందే. తాజాగా జబర్దస్త్ మరో నటుడు హరి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుక్కయ్యాడు.

కాగా, చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తున్న సమయంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి రెండు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ. 3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, గతంలో అక్రమ రవాణాలో కేసులో అరెస్ట్ అయిన జబర్దస్త్ ఫేమ్ హరిబాబుకు ఈ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని విచారణలో తేలింది.

చిత్తూరు జిల్లా పోలీసులు గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతోపాటు, ఇతర కేసులు కూడా నమోదు చేశారు. శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి.. కోట్లు సంపాదించాడని.. అలాగే మరో నటుడి సినిమా కోసం ఈ డబ్బులను వినియోగించడాని గతంలో విపరీతమైన ప్రచారం జరిగింది. మరోవైపు, ఈ అంశంపై హరి స్పందించాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే.. తాను పోలీసులకు సమాచారం అందించానని… ఆ కోపంతో అతను తనపై తప్పుడు కేసులు పెట్టాడని మండిపడ్డాడు.

భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు..

ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటా : కమల్ హాసన్

బాలయ్య పుట్టిన రోజుకు పెద్ద గిఫ్ట్.. ఏంటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -