Friday, April 19, 2024
- Advertisement -

బాలీవుడ్ భామతో మెగాస్టార్.. ఏ సినిమా కోసం అంటే?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఆచార్య సినిమా చిరంజీవి 153 వ చిత్రం.

చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బాబి (కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి 154 వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుందనే సమాచారం వినబడుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.ఇప్పటికే చిత్రబృందం ఈమెతో సంప్రదింపులు జరిపి డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also read:పిల్లల అద్భుత ఆరోగ్యానికి సూపర్ టిప్స్ ఇవే!

ప్రస్తుతం కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత చిరు 154 వ చిత్రం పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి సరసన చందమామ కాజల్ అగర్వాల్ జోడీ కట్టారు. అదే విధంగా ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్దు అనే కీలక పాత్రలో సందడి చేయనున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:గుమగుమలాడే గుత్తి వంకాయ్ కూర.. ఇలా చేస్తే లొట్టలెయ్యాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -