Saturday, April 20, 2024
- Advertisement -

పిల్లల అద్భుత ఆరోగ్యానికి సూపర్ టిప్స్ ఇవే!

- Advertisement -

సాధారణంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలు తరచూ ఎన్నో జబ్బులకు గురవుతుంటారు. వారిలో రోగనిరోధక శక్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే వారి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే వారికి అద్భుతమైన ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఈ ఆయుర్వేద ఆహార నియమాలను, పాటించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరి ఆ ఆయుర్వేద వైద్య విధానాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

*పిల్లల్లో తరచు జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతుంటాయి. దీని ఫలితంగా పిల్లల్లో పలుమార్లు విరోచనాలు కావడం లేదా మలబద్దక సమస్య ఏర్పడటం అలసట, అజీర్తి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు కరివేపాకు కారం,సొంఠి కారం, పలుచని మజ్జిగ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఈ విధమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల వారిలో జీర్ణక్రియ సమస్యలు ఉండవు.

*చాలామంది పిల్లల్లో ఆకలి లేకపోవడం, తినాలనే కోరిక తగ్గడం వంటి సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద ఔషధం అయిన అగ్నితుండువటి ఔషధాన్ని సాయంత్రం ఒక గుళిక వేసుకోవడం వల్ల పిల్లల్లో ఆకలి కలుగుతుంది.

Also read:ఎగ్ బన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

*పిల్లలు తరచూ ఆహారం తింటున్న మాటిమాటికీ ఏదోఒకటి తినాలనే కోరిక కలుగుతుంది. అదేవిధంగా కొందరికి ఎప్పుడు నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వారు ఆరోగ్య వర్దిని వటి గుళికలు ఉదయం సాయంత్రం భోజనం తర్వాత తీసుకోవటం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

*కొందరు పిల్లల్లో నీళ్ల విరోచనాలు కావడం, మరికొందరిలో మూత్రం సరిగా రాకపోవడం, ఆహారసంబంధ అలర్జీలు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి వారు ఉదయం సాయంత్రం భోజనం తర్వాత 10 మి.లీ మహా సుదర్శన కాడ ఔషధాన్ని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల వారిలో ఈ సమస్య తొలగిపోతుంది.

Also read:సోంపు తినండి.. ఆ సమస్యకు చెక్ పెట్టండి!

*పిల్లలలో విరోచనాలు అధికంగా అయితే ఇంట్లోనే మెంతులను తీసుకొని ఒక స్పూన్ మెంతులను పెరుగులో నాన పెట్టుకొని నమలకుండా మింగడం ద్వారా విరోచనాలు తగ్గుతాయి.ఈ విధమైనటువంటి టిప్స్ పాటించడం వల్ల పిల్లల ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -