Friday, May 3, 2024
- Advertisement -

‘లైవ్’లో ఫోన్ నెంబర్ ఇచ్చిన శ్రీముఖి.. మీకు తెలుసా?

- Advertisement -

బుల్లితెర హాట్ యాంకర్‌గా పాపులర్‌ అయిన శ్రీముఖి మొదట వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే సరైన గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు అద్భుతమైన స్టార్డమ్ తెచ్చుకుంది.బుల్లితెరపై తన గ్లామ‌ర్‌తో, చలాకి మాటలతో రచ్చ చేస్తూనే వీలైనప్పుడల్లా హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా ఫాలోవర్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తాజాగా ఇండియాలో ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలు బ్యాన్ చేస్తున్నారు అన్న వార్త పై స్పందించి తన అభిమానులతో లైవ్ లో చిట్ చాట్ నిర్వహించింది. అందులో నెటిజన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ బ్యాన్ అయితే మీతో మాట్లాడటం కష్టం కదా అందుకే మాకొక టోల్ నెంబర్ ఇవ్వొచ్చుగా అని ఓ నెటిజన్ అడిగాడు. దీంతో శ్రీముఖి ఫన్నీగా ‘ఒక్కడు’ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఫోన్ నెంబర్ ఇస్తున్న వీడియో పోస్ట్ చేయడంతో దానిపై ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చాలా వచ్చాయి.

Also read:సంక్రాంతికి రిలీజ్ అయ్యేది రెండు సినిమాలే..?

ఇక అదే లైవ్ చిట్ చాట్ లో శ్రీముఖి ని మరొక నెటిజన్ నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రీముఖి అని అడగగా, దానికి శ్రీముఖి సమాధానంగా నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమాలోని వద్దురా …సోదర ..పెళ్లంటే నూరేళ్ళ మంటారా.. అనే పాటతో పెళ్లి పైన ఉన్న తన అభిప్రాయాన్ని ఫన్నీగా అభిమానులతో పంచుకొని సరదాగా అభిమానులతో ముచ్చటించారు.

Also read:పుష్పకు అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్.. వింటే ఉగిపోవాల్సిందే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -