Thursday, May 16, 2024
- Advertisement -

మోడీకి సెగ తగలనుందా ?

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడి ఈ నెల 11,12 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. 11న ఏపీలో పర్యటిస్తే, 12 న తెలంగాణలో పర్యటిస్తారు. అయితే ఏపీ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణలో మోడీ పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది. ఇది బీజేపీకి కాస్త అసంతృపి కలిగించే విషయమే అయినప్పటికి అధికార టి‌ఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం గమనార్హం. .

ఇదిలా ఉంచితే టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం కూడా బీజేపీ దూకుడుకు కాస్త అడ్డుకట్ట వేసిందనే చెప్పాలి. అలాగే ప్రస్తుతం తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ వర్సస్ బీజేపీ మద్య రాజకీయ రగడ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లో కూడా ప్రధాన ప్రత్యర్థి పార్టీగా బీజేపీనే భావిస్తున్నారు. ఇలాంటి రాజకీయ రగడల నేపథ్యంలో తెలంగాణలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి మోడి రానున్నారు. మోడి తన బహిరంగ సభలో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపైనే అందరిలోనూ చర్చ జరుగుతోంది. ఇక టి‌ఆర్‌ఎస్ నేతలు మోడి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ప్రోటోకాల్ పరంగా కనీసం ప్రభుత్వానికి ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ప్రధాని రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ప్రాజెక్ట్ లు ఎందుకు ఇవ్వడం లేదని, తెలంగాణ వచ్చే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ టి‌ఆర్‌ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు టి‌ఆర్‌ఎస్ శ్రేణులు. ఇక మోడీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టి‌ఆర్‌ఎస్ పై బీజేపీ నేతలు కూడా అంతే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ని, ప్రధాని నరేంద్ర మోడీని రాజకీయంగా ఎదుర్కొలేక మోడీ రాకను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కమలనాథులు మండి పడుతున్నారు. ఇలా బీజేపీ టి‌ఆర్‌ఎస్ మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనెంతలా రాజకీయ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మోడీ తన పర్యటనలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

ప్రజలంటే చిన్నచూపు ఎందుకు జగన్ సార్ !

ఏపీలో ఉపఎన్నిక..రాబోతుందా ?

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -