Tuesday, April 30, 2024
- Advertisement -

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

- Advertisement -

బుల్లితెరపై బిగ్ బాస్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఈ రియాల్టీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు.. ప్రేక్షకులంతా మిగతా అన్ని ఛానెల్లను వదిలేసి స్టార్ మా కు అతుక్కుపోతుంటారు. బిగ్ బాస్ వచ్చినన్ని రోజులు ఈ షో నే ఎక్కువ రేటింగ్ సంపాదించుకుంటుందన్న విషయం తెలిసిందే. తెలుగు బుల్లితెర ఇప్పటికే ఎంతో సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకుంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సీజన్ 5 జూన్ లో మొదలు కాబోతుందని సమాచారం అందుతోంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక కూడా జరుగుతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేది వీళ్లేనంటూ ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ సీజన్ లో పాపులర్ సింగర్ హేమచంద్ర సెలక్ట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈయనతో స్టార్ మా నిర్వాహకులు సంప్రదింపులు జరిపారని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ ప్రముఖ సింగర్ ను ఫైనలైజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరికొంత మంది టాప్ సెలబ్రిటీలను కూడా ఇందులోకి తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సీజన్ లో హోస్ట్ గా నేచురల్ స్టార్ నాని పేరు వినిపిస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు !

అయ్యయ్యో.. బాలయ్యకు ఏంటీ ఈ కష్టాలు !

అప్పుల్లో నాల్గో స్థానంలో ఏపీ

‘గజకేసరి’ గా దూసుకొస్తున్న యశ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -