Friday, April 19, 2024
- Advertisement -

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

- Advertisement -

పిల్లలు బరువు పెరగడానికి తల్లిదండ్రులు తీసుకునే కేర్ అంతా ఇంతా ఉండదు. తమ బిడ్డ ఆరోగ్యంగా.. పుష్టిగా ఉండాలంటూ తల్లిదండ్రులు రకరకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న పిల్లల విషయంలో సవాళ్లు మామూలుగా ఉండవు. అయితే తాజాగా ఓ తండ్రి మాత్రం తన కూతురి పట్ల తీసుకుంటున్న కేర్ తో వార్తల్లో నిలిచారు. తక్కువ బరువుతో పుట్టిన తన కూతురు బరువు పెరగడానికి ఆ తండ్రి సరికొత్త ప్రయోగం చేసి వార్తలో నిలిచారు.

సియాటెల్ కు చెందిన రూడీ విల్లింగ్ హామ్ అనే వ్యక్తికి తక్కవు బరువుతో పుట్టిన లిల్లీ అనే పాప ఉంది. ప్రస్తుతం ఈ చిన్నారికి 8 నెలల వయసుంది. అయితే ఈ చిన్నారి బరువు తక్కువగా ఉందని డాక్టర్లు ఆ చిన్నారికి ఎక్కువ క్యాలరీలు అందించాలని సలహానిచ్చారు. దాంతో రూడీ తన కూతురు కోసం సరికొత్త ప్రయోగం చేశారు. బీర్ బాంగ్ కు మార్పులు, చేర్పులు చేసి తన కూతురికి ఎక్కువ పాలు పట్టించేలా బేబీ బీర్ బాంగ్ ను తయారు చేసి.. వార్తల్లో నిలిచారు.

తన కూతురు బరువు పెరిగేందుకే ఈ ప్రయోగం చేశానని చెప్పుకొస్తున్నారు రూడీ. ఈ బేబీ బీర్ బాంగ్ ద్వారా తన కూతురికి కొతలత ప్రకారం పాలను అందించవచ్చని చెప్పుకొస్తున్నారు. కొన్ని రోజులుగా తన పాపకు ఈ పరికరం ద్వారానే రూడీ విల్లింగ్ పాలు పట్టిస్తున్నారట. కాగా ఈ పరికరం ద్వారా తన కూతురుకు పాలు పట్టిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో రూడీ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. తండ్రి ప్రేమకు ఇదే నిదర్శనమని కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు.

‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు !

అయ్యయ్యో.. బాలయ్యకు ఏంటీ ఈ కష్టాలు !

అప్పుల్లో నాల్గో స్థానంలో ఏపీ

‘గజకేసరి’ గా దూసుకొస్తున్న యశ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -