Sunday, April 28, 2024
- Advertisement -

డేరా బాబా కరోనా పాజిటీవ్

- Advertisement -

డేరా బాబాగా పేరుగాంచిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ కరోనా బారినపడ్డారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినులపై అత్యాచారం చేసినందుకు 2017 ఆగస్టులో 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులో 2019 జనవరిలో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతనికి, మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. 

జైలు శిక్ష పడిన నాటి నుంచి ఆయన రోహ్తక్‌లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. కడుపు నొప్పితో బాధపడుతున్న డేరా బాబా జైలు అధికారులకు రోహ్తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్‌)లో పరీక్షలు చేయించారు. అనంతరం అక్కడి నుంచి మెదాంత తరలించి కరోనా పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్థారణ అయింది.

జైలు శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా అలియా గుర్మీత్ రామ్ రహీమ్ తాను వ్యవసాయం చేసుకుంటానంటూ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో డేరా బాబా మరోసారి వార్తల్లోకి వచ్చారు. తాను చేసిన నేరాలు క్షమించరాని పెద్ద నేరాలేమీ కాదని.. జైలులో తన సత్ ప్రవర్తన చూసి పెరోల్ ఇవ్వాలని డేరాబాబా వేడుకున్నారు.

పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీ.. 30 మంది మృతి

ఆ పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో.

బీజేపీలో చేరికపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లారిటీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -