Friday, April 19, 2024
- Advertisement -

శంకర్, చరణ్ మూవీలో స్టార్ హీరో!

- Advertisement -

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు తెరపై వస్తుందా అని అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన కథపైనే శంకర్ కసరత్తు చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని విధాలుగా ప్రేక్షకులను మెప్పించే విధంగా కథను సిద్దం చేస్తున్నారు శంకర్.

ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సుదీప్ మంచి పరిచయమే. ఈగ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ తర్వాత బాహుబలి చిత్రంలో కనిపించారు.

కన్నడ చిత్రాలు తెలుగు లో డబ్ అయ్యాయి. శంకర్ అతనికి కాల్ చేసి కథ చెప్పడం .. తన పాత్రను గురించి తెలుసుకున్న సుదీప్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. చరణ్ కెరియర్లోనే పెద్ద సినిమా కావడం వలన సుదీప్ వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు.

నాకు అన్యాయం జరిగింది.. నా వెంటే కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు : ఈటెల

లాక్ డౌన్ ఆలోచన లేదు.. ఆ విషయంలో జాగ్రత్త : సీఎస్ సోమేశ్ కుమార్

మందుబాబుల్లో అది చూస్తే ఉందంటున్న యాంకర్ రవి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -