Tuesday, April 23, 2024
- Advertisement -

లాక్ డౌన్ ఆలోచన లేదు.. ఆ విషయంలో జాగ్రత్త : సీఎస్ సోమేశ్ కుమార్

- Advertisement -

రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించబోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం మెడికల్ ట్రీట్మెంట్‌కు హబ్‌గా తయారైందని, సరిహద్దు రాష్ట్రాలకు చెందిన వారు చికిత్స కోసం ఇక్కడికే వస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల వారూ ఇక్కడికే చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. ఈ మద్య కేసులు తగ్గుతూ వస్తున్నాయని అన్నారు.

ప్రతి ఆస్పత్రిలో పడకలతో పాటు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ తమను ఆదేశించారని అన్నారు. కేసులు అదుపు చేయాల్సి వస్తే.. వారాంతపు లాక్‌డౌన్ విషయం గురించి మాత్రం ఆలోచిస్తున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు. లాక్‌డౌన్ విధించి ప్రజలను ఇబ్బంది పెట్టడం కంటే, వారికి మంచి చికిత్స అందించడం ఎంతో ముఖ్యమన్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు జీవనోపాధిని కోల్పోతారన్నారు. ఇప్పటి వరకూ 42 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ డోసులు అందించామని, 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ అందుబాటులోనే ఉందని తెలిపారు.

ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని సీఎస్ సోమేశ్ కుమార్ భరోసా కల్పించారు. అయితే, రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అవసరమైనప్పుడు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

ఉదయభానుతో అలాంటి రూమర్స్ పై స్పందించిన దర్శకుడు.. ఏం అన్నాడంటే?

ఇప్పటి వరకు ఎవరు చూడని మెగా డాటర్ నిహారిక ఫోటో!

మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -