నాకు అన్యాయం జరిగింది.. నా వెంటే కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు : ఈటెల

- Advertisement -

గత మూడ్రోజులుగా హుజురాబాద్‌లోనే ఉంటూ.. కార్యకర్తలు, మద్దతుదారులతో మంతనాలు జరిపారు ఈటల. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘మిగిలిన జిల్లాల ప్ర‌జ‌లు కూడా వ‌చ్చి నాతో మాట్లాడారు. నాకు అన్యాయం జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు’ అని ఈట‌ల తెలిపారు. చాలా మంది శ్రేయోభిలాషులు అమెరికాతో పాటు ప‌లు దేశాల నుంచి కూడా ఫోను చేస్తున్నారు. నాకు కొన్ని వేల ఫోను కాల్స్ వ‌చ్చాయి.

నేను ఏ నిర్ణ‌యం తీసుకున్నా నా వెంటే ఉంటామ‌ని కార్య‌క‌ర్త‌లు భ‌రోసా ఇచ్చారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఏం కోరుకున్నారో.. వారు ఏం ఆశించారో వారి క‌ల నెర‌వేరాక వారికి ఏం జ‌రుగుతోందో మీకు తెలుసు. న్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాల‌ను తీసుకున్నాను.

- Advertisement -

క‌రోనా ఉంది కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా కొంద‌రు స‌ల‌హా ఇచ్చారు. నాకు సంబంధించి ఏదైనా స‌మ‌స్య త‌లెత్తితే నేనే నేరుగా మీడియాకు తెలుపుతాను. నా గురించి గిట్టని వారు అవాక్కులు.. చివాక్కులు పలుకుతున్నారు.. నా గురించి ఇచ్చే స‌మాచారాన్ని మాత్రం నమ్మ‌కండి అని ఈట‌ల విన్న‌వించారు.

ఇప్పటి వరకు ఎవరు చూడని మెగా డాటర్ నిహారిక ఫోటో!

వైరల్ ఫోటోలు.. వంటలక్క కూతుర్ల అందం మాములుగా లేదుగా..!

మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -