Sunday, May 12, 2024
- Advertisement -

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ లీక్

- Advertisement -

బాలకృష్ణ-శ్రియ జంటగా తెర‌కెక్కుతున్న సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా టీజ‌ర్ ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ వేసింది. అయితే షాకింగ్‌గా ఈ సినిమా టీజ‌ర్ ఒక రోజు ముందుగానే లీక్ అయిపోయింది.

అర నిమిషం నిడివి ఉన్న గ్యారేజ్ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో జోరుగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వార్ సీన్స్‌లో చేయి తిరిగిన యోధుడిగా బాలకృష్ణ పోరాట సన్నివేశాల్లో భళా అనిపిస్తున్నాడు. జార్జియాలో తెరకెక్కించిన క్లైమాక్స్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా అనిపిస్తోంది. ఈ లీక్ అయిన టీజ‌ర్‌లో ‘గౌతమిపుత్ర శరణమా.. మరణమా’ అనే డైలాగ్ సూపర్బ్‌గా ఉంది.

ఇక శ‌ర‌ణ‌మా…మ‌ర‌ణ‌మా అనేది బాహుబలి సినిమాలో యుద్ధంలో మ‌హిష్మతి సైన్యం వెనుదిరిగినప్పుడు సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ త‌ర‌హాలో ఇది కూడా చాలా ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌గా క‌నిపిస్తోంది. మొత్తానికి టీజర్ ఒకరోజు ముందే సోషల్ మీడియాలో ఇలా హంగామా చేయడంతో యూనిట్ షాకైంది. గ‌తంలో కూడా ఈ సినిమా స్టిల్స్ లీక్ అవ్వ‌డంతో చిత్ర యూనిట్‌పై బాల‌య్య ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక లీక్ అయిన టీజ‌ర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

{youtube}QbywrX8N-9k{/youtube}

Related

  1. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఫస్ట్ లుక్ అదిరింది!
  2. చిరంజీవి కంటే బాలకృష్ణే ఫాస్ట్ ..
  3. దేవీ శ్రీ ప్రసాద్ వెళ్ళిపోవడమే మంచిది అనుకుంటున్న బాలకృష్ణ అభిమానులు
  4. బాలకృష్ణ కొడుకు ఫస్ట్ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -