Thursday, March 28, 2024
- Advertisement -

ఆస్కార్ బెస్ట్ యాక్టర్ రేసులో తమిళ హీరో సూర్య

- Advertisement -

సింగం మూవీ తర్వాత చాలా కాలం నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రముఖ తమిళ నటుడు సూర్యకు సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) మూవీ మవీ మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి. గతేడాది లక్ డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టగలిగింది.

ఈ సినిమా సామాన్యులకు విమాన ప్రయాణాలు కల్పించేలా చేసిన కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా సూరారై పొట్రు సినిమాను సుధా కొంగర దర్శకత్వలో తెరకెక్కింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. సర్వత్రా మంచి స్పందనను రాబట్టిన ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు బరిలో నిలిచింది. జనరల్ కేటగిరిలో బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, డైరెక్టర్, ఒరిజినల్ స్కోర్ తో పాటు పలు విభాగాల్లో పోటీకి సిద్ధమైంది.

ఈ చిత్రం బెస్ట్ పిక్చర్ విభాగంలో నామినేషన్ సాధించిందని తాజాగా అస్కార్ కమిటీ ప్రకటించింది. మార్చి 5న ఈ మూవీకి ఓటింగ్ జరగనుంది. అలాగే, హీరో సూర్య, అపర్ణ బాల మురళీలు సురారై పొట్రులో ఓ రేంజిలో నటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే వీరిద్దరు ఉత్తమ నటీనటులుగా ఆస్కార్ రేసులో నిలిచారు. ఆయా విభాగాల్లో ఆస్కార్ వరించాలని సూర్య అభిమానులతో పాటు భారతీయులు కోరుకుంటున్నారు.

షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !

‘అన్నాతే’ షూటింగ్ లో సూప‌ర్ స్టార్ ర‌జినీ

సోష‌ల్ మీడియాపై కేంద్రం చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌శాంతి

మ‌హా శివరాత్రికి పవన్ సినిమా ఫస్ట్ లుక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -