5 రాష్ట్రాలకి మోగిన ఎన్నికల భేరి..!

- Advertisement -

కేరళ, తమిళనాడు, బెంగాల్, అస్సాం రాష్ట్రాలతోపాటు.. పుదుచ్ఛేరి యూటీలతోపాటు వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు కారణాలతో ఖాళీ అయిన శాసనసభ, లోక్‌సభ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 4 లోక్‌సభ స్థానాలు, వివిధ రాష్ట్రాల్లో 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. కేరళ, బంగాల్‌, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.

ఇందుకోసం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి.. పరిస్థితులను పర్యవేక్షించింది. బంగాల్​లో ఎన్నికల పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠను తలపిస్తున్నాయి. బంగాల్‌ అసెంబ్లీలో 294 స్థానాలున్నాయి. 140 స్థానాలున్న కేరళ 14వ శాసనసభ గడువు జూన్‌ 1వ తేదీన ముగియనుంది. గత ఎన్నికల్లో వామపక్షాల నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించింది.

- Advertisement -

రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల్లో చెరో 3 అసెంబ్లీ సీట్లతో పాటు తెలంగాణ, ఒడిశా, నాగాలాండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరాం, మహారాష్ట్ర, హరియాణా, మేఘాలయ, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ సీటుకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి. 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే ఉపఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. తమిళనాడులో 15వ శాసనసభ గడువు మే 24తో ముగియనుంది. 234 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం అన్నాడీఎంకే అధికారంలో ఉంది.

మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత జైలుకెళ్లిన ఆమె నెచ్చెలి శశికళ ఇటీవలే విడదలయ్యారు. దీంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పుదుచ్చేరి శాసనసభ గడువు మే వరకు ఉంది. అయితే ఇటీవల అక్కడ నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో శాసనసభలో కాంగ్రెస్‌ బలం తగ్గింది. దీంతో బలనిరూపణలో విఫలమైన నారాయణస్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు.

అక్షర సినిమా రివ్యూ…!

అనిల్ రావిపూడితో మహేష్ బాబు కొత్త సినిమా

నితిన్ ‘చెక్’ పెట్టలేకపోయాడా?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -