Friday, March 29, 2024
- Advertisement -

హరిహర వీరమల్లు నుంచి స్పెషల్ సర్ప్రైజ్.. ఎప్పుడో తెలుసా..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా పాన్ ఇండియా కేటగిరీలో చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఖుషీ ఫేమ్ ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందటే ప్రారంభించిన కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా రోజుల పాటు షూటింగ్ ఆగిపోయింది.

అతి త్వరలోనే ఈ సినిమా నూతన షెడ్యూల్ ప్రారంభం కానుంది. హరిహర వీరమల్లు నుంచి ఇప్పటికే వచ్చిన పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా హరిహర వీరమల్లు నుంచి స్పెషల్ మేకింగ్ వీడియో విడుదల చేయనున్నట్లు సమాచారం.

హరిహర వీరమల్లు మొగలాయిల కాలం నాటి కథతో రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇక భారీ చిత్రంగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు వేసవి కానుకగా విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Also Read

చిరు చేసిన తప్పే బన్నీ చేస్తున్నాడా..!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -