చిరు చేసిన తప్పే బన్నీ చేస్తున్నాడా..!

- Advertisement -

2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ సైరా విడుదలైంది. సినిమా బాగుందని మంచి టాక్ తెచ్చుకుంది. బాహుబలి సినిమాలా గ్రాండ్ గా ఉందని ప్రశంసలు అందుకుంది. తెలుగునాట ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. కానీ ఫైనల్ గా ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. సినిమా విడుదలకు సంబంధించి సరైన డేట్ ను ఎంపిక చేయకపోవడం వల్లే సైరా సినిమా కు ఆశించిన స్థాయిలో వసూలు దక్కలేదనే వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి.

పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే ఈ సినిమా సౌత్ వరకు భారీగానే కలెక్షన్లు రాబట్టింది. కానీ ఉత్తరాదిలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. దానికి కారణం సైరా విడుదలైన రోజే హృతిక్ రోషన్, టైగర్ ష్రాప్ హీరోలుగా తెరకెక్కిన వార్ సినిమా విడుదల కావడమే.

ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో యాక్షన్ సినిమాగా నిర్మితమైంది. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో సైరా సినిమాకు కలెక్షన్ల విషయంలో దెబ్బపడింది. సైరా సినిమా బాగున్నప్పటికీ హిందీ లో డైరెక్ట్ గా విడుదలైన వార్ సినిమా చూసేందుకే అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపారు. ఫలితంగా సైరాకు కలెక్షన్ల విషయంలో నిరాశే ఎదురైంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అదే రోజు హిందీలో అమీర్ ఖాన్, తెలుగు హీరో నాగచైతన్య కలిసి నటిస్తున్న లాల్ సింగ్ చద్దా విడుదల అవుతోంది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అమీర్ ఖాన్, నాగచైతన్య ఆర్మీ అధికారులు గా కనిపించనున్నారు.

అమీర్ ఖాన్ బాలీవుడ్ లో అగ్ర హీరో. ఆయన నటించే సినిమాలు అక్కడ భారీ స్థాయిలో విడుదల అవుతుంటాయి. అలాంటప్పుడు అమీర్ ఖాన్ తో పోటీపడి పుష్పను విడుదల చేసినా అక్కడి ప్రేక్షకులు హిందీలో తీసిన సినిమాను చూసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది.దీనివల్ల పుష్పకు కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా విషయంలో జరిగిన తప్పే ఇప్పుడు పుష్ప సినిమా విడుదలలో జరుగుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా విడుదలకు సరైన తేదీని ఎంపిక చేసుకోవాలని వారు కోరుతున్నారు.

Also Read

ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ లో రామ్ చరణ్ సినిమా..!

తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీస్

నే కూడా సంక్రాతికే వస్తానంటున్న సీనియర్ స్టార్ హీరో..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -