ఉన్నదంతా ఊడ్చేయడమే మా అధ్యక్షుడు నరేష్ పని.. హేమ సంచలన వ్యాఖ్యలు..!

- Advertisement -

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. ఇంకా ఎన్నికలు కూడా రాకముందే నటీనటులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ కొనసాగుతున్నారు. అయితే ఇప్పటికే మా కు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మా ప్యానల్ పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. అయితే సెప్టెంబర్లో మా కు ఎన్నికలు జరగనున్నాయి.

ఈసారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు, జీవిత రాజశేఖర్,హేమలత,సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పోటీలో ఉన్న వారు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజు నరేష్ మధ్య ట్వీట్ల వార్ జరుగుతుండగా తాజాగా నటి హేమలత నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. నరేష్ అసలు ఎన్నికలు జరగకుండా చేసి అధ్యక్షుడిగా కొనసాగాలని పావులు కదుపుతున్నట్లు ఆమె ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం ఉన్న ప్యానెల్ మా కోసం డబ్బులు సమకూర్చ కుండా.. ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తున్నారని విమర్శించారు. తామేమో దేశవిదేశాలలో ప్రత్యేకంగా ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి డబ్బు సమకూర్చు తుండగా.. నరేష్ మాత్రం ఉన్న డబ్బును ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. వెంటనే మా ఎన్నికలు జరపాలంటూ హేమ సంతకాల సేకరణ ప్రారంభించారు. ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్ పై హేమ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Also Read

నాని .. అస్సలు తగ్గట్లేదు…!

పుష్పలో విలన్​గా సునీల్​..!

ఓ రేంజ్ లో అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -